Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్యకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అదే ఆయన మ్యాన్షన్ హౌస్ బ్రాండ్. బాలకృష్ణ ఎక్కడికి వెళ్లినా ఈ మందు బాటిల్ తన బ్యాగ్ లో తీసుకువెళ్తారనే విషయం మనకు తెలిసిందే .
ఇక ఇప్పుడు బాలయ్య ఏకంగా ఈ బ్రాండ్ కే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి తరుణంలోనే బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ ఒక గొప్ప నటుడిగా రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా ఈయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది.
ఇలాంటి ఎంతో గొప్ప పురస్కారాన్ని అందుకున్న బాలయ్య ఇలా మద్యం తాగండి అంటూ ప్రచారం చేయడం ఏంటి అంటూ చాలామంది బాలయ్య తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఒక గొప్ప నటుడు అయ్యిండుకొని మద్యం తాగమని ప్రోత్సహించడం ఏంటి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మీకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది కనీసం ఆ గౌరవం కూడా లేకుండా ఇలా మద్యం ప్రమోట్ చేయడం ఏంటి అంటూ నేటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఇలా బాలకృష్ణ గురించి విమర్శలు వస్తున్న తరుణంలో బాలయ్య అభిమానులు స్పందిస్తూ బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పటికీ ఆయన ప్రమోట్ చేస్తోంది ఆల్కహాల్ కాదని డ్రింకింగ్ వాటర్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.