మహిళలలో చాలామంది డబ్బులను సరైన విధంగా ఇన్వెస్ట్ చేయడానికి వేర్వేరు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ సంఖ్యలో స్కీమ్స్ తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుండటంతో ఈ స్కీమ్స్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. మహిళలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. ఉమెన్ హానర్స్ సర్వింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అమలవుతోంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పేరుతో అమలవుతున్న ఈ స్కీమ్ లో మహిళలు ఎవరైనా డిపాజిట్ చేసే అవకాశం ఉంది. మహిళ లేదా మైనర్ బాలిక పేరు మీద ఈ పథకం కింద ఖాతా తెరిచే ఛాన్స్ ఉండగా గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డబ్బులను డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రెండేళ్ల కాల వ్యవధితో ఈ స్కీమ్ లో డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ స్కీమ్ పై ఏకంగా 7.5 శాతం వడ్డీ రేటు అమలవుతూ ఉండటం గమనార్హం. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం పొందే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కొన్ని అదనపు ప్రయోజనాలను ఈ స్కీమ్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. కనీసం 1000రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
రెండేళ్ల పాటు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా రెండేళ్లు ఇన్వెస్ట్ చేస్తే 32000రూపాయల వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. బ్యాంక్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.