అక్కినేని అందగాడు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇదే ఉత్సాహంతో తదుపరి ప్రాజెక్టులపైనా ఫోకస్ పెట్టనున్నాడు. ఆల్రెడీ వెర్సటైల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం డిఫరెంట్ మేకోవర్‌లోకి అఖిల్ మారిపోయాడు. చూజాయగా ‘బ్యాచ్‌లర్’ ప్రమోషన్స్‌లో ఆ లుక్స్‌తోనే కనిపిస్తున్నాడు అఖిల్. ఇకపోతే, ‘బ్యాచిలర్’ ఇచ్చిన సక్సెస్‌తో ఈ సినిమాకి బాగా ఊతమొచ్చింది. సురేందర్ రెడ్డి సినిమా అంటే ఆషా మాషీ కాదు. ఆల్రెడీ సక్సెస్ కొట్టిన జోష్‌లో ఉన్నాడు.
ఇదే స్పీడుతో ‘ఏజెంట్’ పూర్తి చేసి, ప్రేక్షకుల మనసులో దక్కించుకున్న ఈ స్థానాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకుంటున్నాడట అఖిల్. ‘బ్యాచ్‌లర్’ పార్టీలన్నీ కంప్లీట్ చేసుకుని ఇక ‘ఏజెంట్’ కోసం కంప్లీట్‌గా టైమ్ కేటాయించాలనుకుంటున్నాడట.
సురేందర్ రెడ్డి సినిమాల్లో హీరో చాలా స్టైలిష్ లుక్స్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు. ‘బ్యాచిలర్’ ఇచ్చిన ఎనర్జీ ఆ కాన్ఫిడెన్స్‌ని అఖిల్ నరనరాలా నింపేసింది. ఇంకేముంది.. ‘ఏజెంట్’తో మరో సక్సెస్‌నీ అఖిల్ బాబు తన ఖాతాలో వేసేసుకుంటాడేమో. రెడీ టు యాక్షన్.