టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ వివాహానంతర రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం అట్టహాసంగా జరగింది. జూన్ 6వ తేదీ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ లొకేషన్‌లో సంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి తర్వాత, ఈ గ్రాండ్ రిసెప్షన్‌తో అక్కినేని ఫ్యామిలీ మెగా సెలబ్రేషన్ నిర్వహించినట్లయింది.
ఈ వేడుకల్లో అఖిల్ బ్రౌన్ కలర్ సూట్‌లో స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. జైనబ్ గోల్డ్ లెహంగాలో ఓ రాయల్ ప్రిన్సెస్‌లా మెరిసింది. కొత్త దంపతుల స్టన్నింగ్ లుక్‌కు గెస్ట్‌లు ఫిదా అయిపోయారు. ప్రతి ఒక్కరూ వారితో కలిసి ఫోటోలు దిగుతూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై, నూతన జంటను ఆశీర్వదించారు. అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్యతో కలిసి సీఎం ఫోటోలు దిగారు. రాష్ట్ర మంత్రుల్లో కొంతమంది కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సినీ రంగం నుంచి రిసెప్షన్‌లో తారల సందడి కనిపించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతతో కలిసి వచ్చి అఖిల్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ – ఉపాసన, హీరో నాని, నిఖిల్, అల్లరి నరేష్ కూడా తమ ఫ్యామిలీలతో సహా ఈ వేడుకలో పాల్గొన్నారు. కోలీవుడ్ స్టార్ సూర్య స్పెషల్ గెస్ట్‌గా కనిపించారు.
దర్శకులు సుకుమార్, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు సానలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. రాజకీయ వర్గం నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రిసెప్షన్‌కి హాజరై, అక్కినేని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.
అఖిల్, జైనబ్ గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. గతేడాది నవంబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరగగా, ఇప్పుడు ఆ బంధం పెళ్లి రూపం దాల్చింది. ప్రేమ నుంచి పెళ్లి వరకు సాగిన ఈ ప్రయాణాన్ని అక్కినేని ఫ్యామిలీ ఒక ఫెస్టివల్ లా జరుపుకుంది. ఈ గ్రాండ్ రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.