యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న లైగర్ ఫస్ట్ సింగిల్..?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఆ పోస్టర్ అత్యధిక సంఖ్యలో వ్యూస్ సాధించింది. తాజాగా ఈ సినిమా నుండి ఒక పాటని సినిమా బృందం విడుదల చేసింది. తాజాగా లైగర్ సినిమా నుంచి విడుదలైన ‘అక్‏డి పక్‏డి’ సాంగ్ యూట్యూబ్‏ ని షేక్ చేస్తోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్.. 8 లక్షలకు పైగా లైక్స్‏ సంపాదించి యూట్యూబ్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ విషయాన్ని సినిమా బృందం ట్విట్టర్ వేదికగా తెలియజేశారు .

ఇటీవల విడుదలైన ఈ పాటకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో విజయ్ దేవరకొండ మొదటి సారి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు . పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు హిందీ తమిళ్ భాషలలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు మణిశర్మ, తనిష్క్ బాఘ్చి సంగీతం అందించారు . ఇటీవల విడుదలైన ఈ ‘అక్‏డి పక్‏డి’ పాటని తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడగా.. భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించాడు. ఇక హిందీలో మోహ్‌సిన్‌ షైక్‌, అజీమ్‌ దయాని ఈ పాటని ఆలపించారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని కరణ్ జోహార్, ఛార్మీ, పూరి జగన్నాథ్ కలిసి ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వత విజయ్ దేవరకొండ, పూర్తీ జగన్నాథ్ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సమంతతో కలిసి ఖుషి అనే సినిమాలో కూడా నటిస్తున్నారు