ది ఫ్యామిలీ మ్యాన్ -2’కు షాకిచ్చిన లెజెండరీ డైరెక్టర్

Legendary director opposed The Family Man 2 web series
Legendary director opposed The Family Man 2 web series
లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ కష్టాలు ఇంకా తీరలేదు.  ట్రైలట్ రిలీజ్ అవ్వగానే తమిళులు కొందరు ఈ వెబ్ సిరీస్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  వెబ్ సిరీస్లో సమంత చేసిన రాజీ పాత్ర తమిళులను కించపరిచేలా ఉందని, అందుకే బ్యాన్ చేయాలని అనేకమంది సామాన్యులతో పాటు పలు రాజకీయ పార్టీలు సైతం డిమాండ్ చేశాయి.  బ్యాన్ విధించాలని కేంద్రానికి లేఖ రాశారు.  దర్శకులు రాజ్ అండ్ డీకే తమిళులను అగౌరపరిచేలా ఇందులో ఎలాంటి కంటెంట్ లేదు అంటూనే వెబ్ సిరీస్ రిలీజ్ చేసేశారు.  అయితే ముందుకు జాగ్రత్తగా కేవలం హిందీ భాషలో మాత్రనే రిలీజ్ చేసి తెలుగు, తమిళ్ వెర్షన్లు నిలిపివేశారు.  
 
రిలీజయ్యాక వెబ్ సిరీస్ మీద మంచి ఫీడ్ బ్యాక్ అయితే వచ్చింది కానీ తమిళనాట మాత్రం వ్యతిరేకత ఆగలేదు.  ఈసారి ఏకంగా లెజెండరీ డైరెక్టర్ భారతీరాజాగారు వెంటనే వెబ్ సిరీస్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు.  గత కొన్నిరోజులగా ఈ వెబ్ సిరీస్ వివాదం నడుస్తున్నా భారతీరాజాగారు స్పందింలేదు.  అసలు వెబ్ సిరీస్లో ఏముందో చూసి మాట్లాడాలని ఆగిన ఆయన వెబ్ సిరీస్ రిలీజయ్యాక వెంటనే నిలిపివేయమని ముందుకు రావడం వెబ్ సిరీస్ ను వ్యతిరేకించే వారి వాదనకు బలాన్నిస్తోంది.  దీంతో వెబ్ సిరీస్ తమిళ వెర్షన్ విడుదల మీద అనుమానాలు నెలకొన్నాయి.  అంతేకాదు భారతీరాజా స్టేట్మెంట్ కు సమాధానం ఇవ్వాలని రామ్ అండ్ డీకే, సమంతలను డిమాండ్ చేస్తున్నారు వ్యతిరేకులు.