Nagarjuna: అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి ప్రధానపాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ జీ 5 స్టూడియో నిర్మాణంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం బంగార్రాజు.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. మొదటి వారమే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విజయవంతం కావడంతో అక్కినేని నాగార్జున నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.
ఈ క్రమంలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. 2016వ సంవత్సరంలో సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ చిత్రంగా వచ్చిన చిత్రమే బంగార్రాజు.సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అనసూయ, బ్రహ్మానందం వంటి సెలబ్రిటీలు నటించారు.అయితే బంగార్రాజు చిత్రంలో వీరు ఎవరూ లేకపోవడంతో పలువురికి ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే సోగ్గాడే చిన్నినాయన సినిమాలో భాగంగా బ్రహ్మానందం ఆత్మానందం పాత్రలో ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం గా వచ్చిన బంగార్రాజు చిత్రంలో బ్రహ్మానందం సందడి చేయలేదు. ఇలా ఈ సినిమాలో బ్రహ్మానందాన్ని తీసుకోకపోడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను నాగార్జున ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. బంగార్రాజు సినిమా తాత మనవడు కథాంశంతో తెరకెక్కినది అంటే మధ్యలో 30 సంవత్సరాలు గడిచిపోయాయి కనుకఈ కథలో తిరిగి బ్రహ్మానందం గారిని తీసుకురాలేము అందుకోసమే అతని పాత్రని ఈ సినిమాలో చూపించలేదని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.