మెగా మాస్ సినిమాకి లాంచ్ కి డేట్ ఖరారు అయ్యిందా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం “గాడ్ ఫాథర్”. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా భారీ లెవెల్లో తెరకెక్కుతుంది. అలాగే దీనితో పాటుగా దర్శకుడు మెహర్ రమేష్ తో ఇంకో సినిమా భోళా శంకర్ కూడా ప్రోగ్రెస్ లో ఉండగా వీటిని మించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఇంకోటి ఉంది.

అదే దర్శకుడు బాబీ తో ప్లాన్ చేసిన వాల్తేర్ వీరయ్య(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాతో మళ్ళీ పాత చిరు ని చూడడం గ్యారంటీ అని బాబీ ప్రామిస్ చేశారు. మరి ఈ సినిమా స్టార్ట్ ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ఈ వచ్చే నవంబర్ నెల 6న ముహూర్తంతో స్టార్ట్ చేయబోతున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అలాగే చిరు నటించిన “ఆచార్య” సినిమా ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.