దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి నిజంగా ఇండియన్ సినిమాకి దొరికిన ఒక వరం అని చెప్పాలి. తన సినిమాల్లో లాజిక్స్ పక్కన పెడితే తనదైన టేకింగ్ మరియు విజువల్స్ తో మాత్రం మన తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయిలో ఇంకెక్కడో నిలబెడుతుండడం తెలుగు వారిగా భారతీయులుగా చాలా గర్వించాల్సిన అంశం.
తాను లేటెస్ట్ గా తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ప్రపంచ సినిమా దగ్గర భారీ లెవెల్లో రచ్చ లేపుతుంది. బాహుబలి సినిమా ఖండాంతరాలు దాటింది అనుకుంటే ఈ సినిమా అయితే దానికి మించి ముఖ్యంగా హాలీవుడ్ ఆడియెన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఆదరణను అందుకుంటుంది.
ఇక లేటెస్ట్ గా అయితే ఏకంగా హాలీవుడ్ సినిమాలతో పోటీగా బెస్ట్ సినిమాల జాబితాలో టాప్ 10 చిత్రాల్లో RRR కూడా ఒకటిగా నామినేట్ అయ్యింది. అది కూడా హాలీవుడ్ ప్రముఖ విమర్శక సంస్థ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు ఎంపిక చేసిన టాప్ 10 చిత్రాల్లో ఏకైక ఇండియన్ సినిమాగా..
అందులోని మొట్టమొదటి సినిమాగా ఈ చిత్రం నమోదు అయ్యి ఒక అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ లిస్ట్ లో లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే రాజమౌళి అండ్ ఎన్టీఆర్, చరణ్ ల కాంబో ఈ రకంగా ఇంకా అదరగొడుతుంది.
Happy to see #RRRMovie nominated for Best Picture @HCACritics 🤩🤩❤️ #RRR https://t.co/i7QJshKlNR
— RRR Movie (@RRRMovie) June 28, 2022