RRR And Radhe Shyam : “RRR”, “రాధే శ్యామ్” ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు.!

RRR And Radhe Shyam : వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ చిత్రాల్లో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి కాగా ఇంకొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ సినిమా “రాధే శ్యామ్”.

ఈ రెండు సినిమాలు కూడా ఆల్రెడీ జనవరి 7 మరియు జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేసారు. అయితే ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ విషయంలో గత రెండు రోజులు నుంచి ఊహించని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి అని వీటిపై ఓ క్లారిటీ కూడా రాబోతుంది అని కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

మరి వీటిపైనే ఓ క్లారిటీ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ రెండు భారీ సినిమాలు వాయిదా పడుతున్నాయి అనే మాటలో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో జనవరి 7న ట్రిపుల్ ఆర్(RRR) అలానే 14 న రాధే శ్యామ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వనున్నాయి. ఇంకా ఈ చిత్రాలతో కొన్ని చోట్ల 100 శాతం సీటింగ్ తో కూడా ప్రదర్శితం అవ్వనున్నాయని కూడా తెలుస్తుంది.