Prabhas And Maruthi : ప్రభాస్, మారుతీ ల సినిమాపై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం.!

Prabhas And Maruthi : లేటెస్ట్ గా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మళ్ళీ తన కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ భారీ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన “రాధే శ్యామ్” తో ఘోరమైన డిజాస్టర్ ని ప్రభాస్ అందుకోగా ఈ తర్వాత చేసే ఓ సినిమాపై అభిమానులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమానే దర్శకుడు మారుతి తో చేయబోయే సినిమా.
అయితే ఈ సినిమా పట్ల ప్రభాస్ కాన్ఫిడెంట్ గానే ఉన్నా అభిమానులు మాత్రం ఉండలేకపోతున్నారు. ఇక ఇవి పక్కన పెడితే ఈ సినిమాపై లేటెస్ట్ సమాచారం ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికి వస్తే వారిలో కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ పేరు ఫిక్స్ కాగా మరో హీరోయిన్స్ గా రాశీ ఖన్నా మరియు శ్రీ లీలా పేర్లు ఫైనలైజ్ అయ్యాయట.
అలాగే మరో సమాచారం ఏమిటంటే ఈ సినిమాని ఈ వచ్చే ఏప్రిల్ నెలలోనే అధికారికంగా అనౌన్స్ చేసి ముహూర్తం కూడా పెట్టనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా ఈ సినిమా ని కూడా యూవీ క్రియేషన్స్ వారే నిర్మాణం వహించగా థమన్ సంగీతం ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడు.