ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఇదే

రాజమౌళి తర్వాత అంత క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ నీల్ మాత్రమే. రాజమౌళి 20  సినిమాల క్రేజ్ ని ప్రశాంత్ నీల్ కేవలం రెండు సినిమాలతో అందుకున్నాడు. ‘కెజిఫ్’ సిరీస్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమాలు చెయ్యడానికి స్టార్ హీరోలు లైన్ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా లో బిజీ వున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా అనౌన్స్ చేసాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం కొరటాల సినిమాకంటే ప్రశాంత్ సినిమా మీదే ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు.  సినిమా కథకు సంబంధించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది.

ఈ సినిమా ఓ పీరియాడిక్ డ్రామా అని, ఈ సినిమాలో హీరో – విలన్ రెండూ ఎన్టీఆరే అని.. అంటే  ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్, ప్రశాంత్ వాళ్ళ వాళ్ళ సినిమాలు కంప్లీట్ చేసుకున్నాక ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.