యానివ‌ర్స‌రీ స్పెష‌ల్‌.. స్ట‌న్నింగ్ గిఫ్ట్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన లాస్య‌

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పోటీ ప‌డుతూ కార్లు కొంటున్నారు. లేదేంటే ఇళ్లు కొంటూ త‌మ సన్నిహితుల‌కు గృహప్ర‌వేశ ఆహ్వానం పంపుతున్నారు. బిగ్ బాస్ అనే షో గ‌త సీజ‌న్స్ కంటెస్టెంట్స్‌కు ఎంత వ‌రకు ప్ల‌స్ అయిందో లేదో తెలియ‌దు కాని సీజ‌న్ 4 కంటెస్టెంట్స్‌కు మాత్రం పెద్ద వ‌రంగా మారింది. ఈ షో వ‌ల‌న తాను కారు కొన్నాన‌ని కొద్ది సేప‌టి క్రితం త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు సోహెల్‌. ఇక తాజాగా లాస్య కూడా ఓ కారును కొంది. కానీ అది తన కోసం కాదట. తన భర్తకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పుకొచ్చింది.

కొత్త‌కారుతో పాటు త‌న ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేసిన లాస్య‌.. మా ఫ్యామిలీలోకి కొత్త మెంబ‌ర్ వ‌చ్చింది. స్పెష‌ల్ రోజున స్పెష‌ల్ గిఫ్ట్‌లు ఇస్తే ఆ సంతృఫ్తే వేరు. మేం లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేందుకు సిద్ద‌మ‌వుతున్నాం. మీరు మా వీడియోను చూసి ఎంజాయ్ చేస్తార‌ని అనుకుంటున్నామంటూ లాస్య పేర్కొంది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అద‌ర‌గొట్టిన లాస్య పెళ్లి తర్వాత షోస్‌కు దూరంగా ఉంది. బిగ్ బాస్ షోతో మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చిన లాస్య ప్ర‌స్తుతం ప‌లు షోస్‌ను హోస్ట్ చేస్తుంది. మ‌రోవైపు ఇంటి బాధ్య‌త‌ల‌ను కూడా మోస్తుంది.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇళ్ళు, కార్లు కొన‌డం చూస్తే అభిమానులు కూడా త‌మ‌కు బిగ్ బాస్ ఛాన్స్ వ‌స్తే బాగుండు అని క‌లలు కంటున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న శివ‌జ్యోతి, హిమ‌జ‌, అలీ రెజా రీసెంట్‌గా సోహెల్ ఇప్పుడు లాస్య ఇలా వీరందరు కాస్ట్ లీ కార్లు కొని ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసే స‌రికి ఫ్యాన్స్ కూడా సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌వుతున్నారు.శివ‌జ్యోతి అయితే ఏకంగా ఇల్లు కూడా కొనేసింది. ఏదేమైన ప్ర‌తి మ‌నిషికి ఓ టైం వ‌స్తుంద‌ని అంటున్నారు. బిగ్ బాస్ సీజ‌న్ 4 కొంద‌రి త‌లరాత‌లు చాలానే మార్చింద‌ని చెప్పాలి.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lasya Manjunath (@lasyamanjunath)

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles