రోడ్డు పాలైన లారీ బీరు లోడు.. ఎగబడిన మందుబాబులు!

తాజాగా ఓ రోడ్డుపై బీరు లారీ బోల్తా పడింది. దీంతో అక్కడి వాతావరణమంతా మందుబాబుల సందడిగా మారింది. దొరికిన వాళ్లకు దొరికినంత మందు అన్నట్లు మందుబాబులు ఎగబడ్డారు. ఇంతకు అసలేం జరిగిందంటే.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి వస్తున్న ఓ లారీ చిత్తూరు జిల్లా మదనపల్లె కు బయలు దేరింది.

దీంతో ఆ జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టగా అందులో.. బీరు సీసాల లోడు బయటపడింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అక్కడ స్థానికులు వెంటనే అక్కడికి పరుగులు తీసి.. రోడ్డు పై పడిన బీరు సీసాలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పలు చర్యలు చేపట్టారు.