Lakshmi Parvathi: ఎన్టీఆర్ 29 వ వర్ధంతి…. చంద్రబాబుపై సంచలైన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి?

Lakshmi Parvathi: సీనియర్ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణించి నేటికి సరిగ్గా 29 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలోనే ఈ 29వ వర్ధంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఉదయమే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తన తాతయ్య ఘాట్ వద్దకు వెళ్లి తన తాతకు నివాళులు అర్పిస్తూ కాసేపు తన తాత సమాధి వద్ద కూర్చొని తన తాతయ్యకు నివాళులు అర్పించారు.

ఇకపోతే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని లక్ష్మి పార్వతి సైతం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఎన్టీఆర్ ఘాట్ కు పుష్పగుచ్చం పెడుతూ నివాళులు అర్పించారు అనంతరం ఈమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. గత 30 సంవత్సరాలుగా ఎన్టీఆర్ ఆశయం కోసమే తాను బ్రతుకుతున్నానని తెలిపారు. అయితే ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది సమక్షంలో ఆయన నా మెడలో తాళికట్టారు.

ఇలా అందరి సమక్షంలో నన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా నన్ను నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ భార్యగా ఒప్పుకోవడం లేదని తెలిపారు. అంతేకాకుండా ఎన్టీఆర్ మరణం తర్వాత నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పెట్టారని తద్వారా నాకు ప్రతిరోజు వేల సంఖ్యలో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు.

ఇలా మహిళలను వేధిస్తూ సొంత పార్టీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. మీరు అనుకున్నా అనుకోకున్నా నేను మీ అత్తగారిని కదా చంద్ర బాబు అంటూ చురకలు అంటించారు. ఇన్నేళ్లు తన వద్ద డబ్బు ఉన్న లేకపోయినా ఎవరిని కూడా చేయి చాచి రూపాయి అడగలేదు ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నానని తెలిపారు లక్ష్మి పార్వతి. ఎందుకు మీకు నాపై అంత కక్షా నేనేం తప్పు చేశాను. ఎన్టీఆర్ పేరుతో లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు అదేవిధంగా ఆయనని కూడా సాగనంపారు అంటూ ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.