బిగ్‌బాస్‌లోకి లహరి రీ ఎంట్రీ

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 కి సంబంధించి మూడో వారం ఎలిమినేషన్‌లో భాగంగా స్ట్రాంగ్ అండ్ హాటెస్ట్ కంటెస్ట్ లహరి షెరి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అనూహ్యమైన ఎలిమినేషన్ ఇది. లహరి షెరీ ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదెవ్వరూ. కానీ, జరిగింది. అది సరే, తాజాగా లహరి మళ్లీ బిగ్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు.

బిగ్ బాస్ రెండో సీజన్ విజేత అయిన కౌషల్ మండా, లహరికి కొన్ని సూచనలిచ్చాడట. ‘లహరీ.. నీ లాంటి కంటెస్టెంట్ బిగ్ హౌస్‌లో ఉండాలి. బోల్డ్‌గా మాట్లాడతావ్. నువ్వు నీలా ఉంటావ్. హౌస్‌కి నీలాంటి కంటెస్టెంట్స్ పర్ఫెక్ట్ ఫిట్.. నువ్వు బయటికి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది..’ అంటూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాడు.

అంతేకాదు, లహరితో కలిసి దిగిన ఫోటో కూడా పోస్ట్ చేశాడు. అవును నిజమే లహరి ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. లహరి ఎలిమినేషన్ తర్వాత కూడా ఆమె మళ్లీ రావాలంటూ నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. గత సీజన్లను ఒకసారి పరిశీలిస్తే రెండో సీజన్‌లో శ్యామల, నూతన్ నాయుడు వంటి వారు రీ ఎంట్రీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడో సీజన్‌లో అలీ రెజా రీ ఎంట్రీ కూడా జరిగింది. అయితే, నాలుగో సీజన్‌లో మాత్రం రీ ఎంట్రీల్లేవు. ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలే. చూడాలి మరి, ఈ సీజన్‌లో రీ ఎంట్రీ ముచ్చట ఎలా ఉండబోతోందో.