ప్రియ సీనియర్ నటి. రవి మామూలోడు కాదు. లహరి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈ ముగ్గరి మధ్యా ఓ ‘మేటర్’ వివాదాస్పదమయ్యింది. అదే, అర్థరాత్రి లైట్లు ఆర్పేశాక.. రెస్ట్ రూమ్ దగ్గర లహరి, రవిని కౌగలించుకుంటే.. అది ప్రియ చూడటం. కౌగలించుకుంటే అది నేరమా.? అన్న చర్చ తెరపైకొచ్చింది. ‘హౌస్‌లో అమ్మాయిలతో కాకుండా, అబ్బాయిలతోనే ఎక్కువగా తిరుగుతున్నావ్..’ అని లహరి మీద ప్రియ నింద వేసేసింది. ‘నింద’ టోన్‌లో తాను అనలేదని ప్రియ చెప్పింది. కానీ, అసలు విషయం వేరే వుంది.. అదే ప్రియ మైండ్‌లో రవి అలా విషం నింపేశాడు.. లహరికి వ్యతిరేకంగా. అది కూడా ఇప్పటికే బయటపడింది. మరి, నాగార్జున కొత్తగా ఏం బయటపెట్టబోతున్నాడట.? నిజానికి, బిగ్ హౌస్‌లో జరిగేవన్నీ స్క్రిప్టెడ్ వ్యవహారాలేనన్న విమర్శ వుంది.
లేకపోతే, రవి ఎందుకు లహరి మీద అంత నింద మోపుతాడు.? ప్రియ ఎందుకు లహరి మీద అంతలా అబాంఢం వేస్తుంది.? అవి టెలికాస్ట్ అవడమంటే.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడమే. అంటే, ఇక్కడ బిగ్ బాస్ కూడా తప్ప చేసినట్టే లెక్క. దానికి నాగార్జున ఎలాంటి కవరింగ్ ఇచ్చినాగానీ.. ఇది క్షమించరాని వ్యవహారం. పిల్లలే కాదు, పెద్దలు కూడా లహరి మీద ప్రియ, రవి వేసిన అభాండాన్ని చూడలేకపోయారు టీవీల్లో. పదే పదే కౌగలించుకోవడమనే మాట చుట్టూ ఎంత యాగీ జరిగింది నామినేషన్ ఎపిసోడ్ సమయంలో. ఇదంతా ఓ సినిమాటిక్ పులిహోరలానే వుంది. ఇంత డ్రామా అవసరమా.? అవసరమే మరి.. ఆ డ్రామాకి, వీకెండ్ ఎపిసోడ్ డ్రామా అదనం. ఎవరికోసమిదంతా.? సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నారు?? ఇదీ నెటిజన్ల ప్రశ్న.