ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసిన లేడీస్ సూపర్ స్టార్..ఎంతో తెలిస్తే షాక్?

సాధారణంగా ప్రస్తుత కాలంలో అందరూ వారు నివసించే ఇంటిని వారికి నచ్చినట్లు ఎంతో హుందాగా నిర్మించుకోవాలని కలలు కంటున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే ఇంటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకొని ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటారు. ఈ రోజుల్లో ఇంటీరియర్ డిజైన్ కోసమే అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా రెండు కొత్త ఇళ్లను కోనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇళ్ళ కోసం నయనతార ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమచారం.

ఇటీవల ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార తన భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి దేవాలయాలను దర్శించుకుంటూ, విదేశాలలో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నయనతార చెన్నైలో పోయెస్‌ గార్డెన్‌ లో రెండు ఇల్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. పోయోస్ గార్డెన్ సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్ గా పిలువబడుతుంది. పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్, జయచిత్ర ,జయలలిత వంటి ఎందరో సెలబ్రిటీల నివాసాలు ఉన్నాయి. ప్రస్తుతం నయనతార కూడా విగ్నేష్ శివన్ ని పెళ్ళి చేసుకున్న తర్వాత పోయోస్ గార్డెన్ లో రెండు ఇళ్లు కోనుగోలు చేసింది.

నయనతార కొనుగోలు చేసిన ఇల్లు ఒక్కొక్కటి 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార ఎంతో విలాసవంతంగా నిర్మించుకుంటున్న ఈ ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ కోసం దాదాపు 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్‌ డిజైన్‌ చేసే ఒక ప్రముఖ సంస్థ తో రూ.25 కోట్లకు నయనతార ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. తొందర్లోనే నయనతార విగ్నేష్ శివ జంట ఈ పోయోస్ గార్డెన్ లో ఉన్న తమ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తోంది. తెలుగులో కూడా చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించనుంది.