మీనా భర్త మరణానికి గల అసలు కారణాలు బయటపెట్టిన కుష్బూ?

సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల హఠాన్మరణం చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణించడానికి గల కారణాల గురించి వివిధ రకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి కుష్బూ మీనా భర్త విద్యాసాగర్ మరణానికి గల అసలు కారణాల గురించి బయట పెట్టింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ… విద్యాసాగర్ మరణించడంతో ఆమె కుటుంబంతో పాటు ఇండస్ట్రీ కూడా విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణించడానికి గల కారణాల గురించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి. కానీ వాటన్నింటిలో నిజం లేదు..అంటూ కుష్బూ చెప్పుకొచ్చింది.

విద్యాసాగర్ మరణించడానికి కారణం కరోనా అని కొందరు, పావురాల రెట్టల వల్ల ఇన్ఫెక్షన్ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ అవి నిజం కాదు. జనవరిలో విద్యాసాగర్ కోవిడ్ 19 బారిన పడటం నిజమే . కానీ ఆయన కరోనా నుండి కోలుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా మీనా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికమవడం వల్ల డాక్టర్లు ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి బ్రెయిన్ డైడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులు దానం చేసే వ్యక్తి దొరకపోవటంతో ఈ ఆపరేషన్ ఆగిపోయింది .

అందువల్ల మందులతోనే అతని వ్యాధిని నయం చేయటానికి డాక్టర్లు ప్రయత్నం చేశారు. కాకపోతే మందులతో అతని వ్యాధి నయం కాకపోవటంతో ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అంటూ కుష్బూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే భర్తను కోల్పోయి మీన ఆమె కూతురు ఇద్దరు దుఃఖంలో ఉన్నారు. విద్యాసాగర్ మరణించిన తర్వాత ఇలాంటి వార్తలు ప్రచారం చేయటం వల్ల వారు మరింత బాధపడతారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దండి..అంటూ కుష్బూ చెప్పుకొచ్చింది.