శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పొందరులోని టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయడం విషయంలో కూన హద్దు మీరి బెదిరింపులకు దిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఆయనకు సంబంధించిన ఓ ఫోన్ సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే పొందురు టీడీపీ కార్యాలయానికి సున్నం వేయించిన ఓనర్ గుండ్ల మోహన్ రావు, తనకు బిల్డింగ్ అవసరం ఉందని పార్టీ కార్యాలయం తీసివేయాలని అడిగారు. దీంతో గుడ్ల మోహన్ రావు పై కూన తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారుట. అయితే కూన ఇంతగా రెచ్చిపోవడానికి కారణం మోహనరావు వైకాపా నేత కావడమేనని అంటున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం మోహనరావు బిల్డింగ్ కూన కార్యాలయంగా పనిచేసింది. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో మోహనరావు పార్టీ మార్చేసి వైకాపాలో చేరాడు. దీంతో వెనుకున్న నేతల ఒత్తిడితో టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని మోహన్ రావు, కూన రవిని కోరాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కూన రవి వైకాపా నేతని బెదిరించారుట. మర్యాద తప్పితే మాట దాటాల్సి ఉంటుందని హెచ్చరించారుట. అయితే ఈ బెదిరింపు పై కూన రవి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
తాను ఎవర్నీ బెదిరించలేదని, ఇవన్నీ ఆరోపణలన్ని ఖండించారు. మర్యాద తక్కువ పనులు తాను ఎప్పుడు చేయనన్నారు. పొందూరులో ఉన్నది జాయింట్ ప్రాపర్టీ అని , గత పదేళ్ల నుంచి టీడీపీ ఆఫీసు ఆ బిల్డింగ్‌లోనే ఉందన్నారు. ఆఫీసు బిల్డింగ్‌పై ఇద్దరికీ హక్కు ఉందని అన్నారు. మోహనరావు తనకు చెప్పకుండా ఆఫీస్ రంగులు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. కూన రవి గతంలో ఎమ్మార్వోను అసభ్య పదజాలంతో దూషించిన కేసును ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా వివాదం కూన రవికి మరింత ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.