KTR: బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, మాజీ కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురైన విషయం మనకు తెలిసిందే . ఈ హత్య కేసులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈయన హత్యకు భూ వివాదాయ కారణమని మొదటి భావించిన తరువాత ఈయన హత్య వెనక రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
రామలింగరాజు హత్యకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురు అనుమానితులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక నేడు రామలింగరాజు మృతదేహాన్ని పోస్ట్మార్టం కూడా చేశారు అయితే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి.
ఇలా రామలింగరాజు హత్య కేసును తెలంగాణ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేసే నిజా నిజాలను బయట పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలను కూడా జారీ చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, తదితరులపై న్యాయపోరాటం చేస్తున్న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంతో ఈ హత్య వెనుక బిఆర్ ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీలో అవకతవకలు జరిగాయని రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసు వాదిస్తున్న లాయర్ 6 నెలల క్రితం ఆకస్మికంగా మృతిచెందగా నిన్న రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. కేటీఆర్ అండతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరుడు హరిబాబు, సంజీవ్, రవి తదితరులు కలిసి ఈ హత్య చేశారని మృతుడి భార్య సరళ ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇలా ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఎంతో ఉత్కంఠత నెలకొంది.