ఓడిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. తెరాసకు పెరిగిన ఇమేజ్

kcr ktr

 తెలంగాణలో తెరాస పార్టీకి గడ్డు కాలం మొదలైంది అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ వరుసగా దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస కు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. దీనితో కేసీఆర్ పార్టీ పని అయిపోయిందని, తెలంగాణ ప్రజలు ఇక కారుకు గోరీ కట్టబోతున్నారని, కమలాన్ని వికసింపచేయబోతున్నారని అనేక మాటలు వినిపించాయి.

kcr ktr

 అయితే తెరాస పార్టీ అంత ఈజీగా పట్టు వదులుకునే పార్టీ కాదు, ఉద్యమాలతో ఎదిగిన పార్టీ కాబట్టి, ప్రజల నాడి పసిగట్టడంలో ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయిన కానీ, ఎక్కువ సార్లు విజయం సాధించింది. తాజగా మరోసారి గ్రేటర్ ప్రజల నాడి ఏమిటో కనిపెట్టి దానికి తగ్గట్లు ముందుకు వెళ్తుంది తెరాస పార్టీ. GHMC ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఇంటికి 20 వేల లీటర్లు మంచినీరు ఉచితంగా ఇస్తామని తెరాస సర్కార్ ప్రకటించింది. అయితే ఎన్నికల్లో తెరాస సరైన స్థానాలు గెలవకపోవటంతో ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తారా లేదా అనే దానిపై చర్చలు సాగుతున్నాయి.

 ప్రస్తుతం ఇరవై వేల లీటర్ల వరకూ వాడుకుంటే.. నెలకు ఐదు వందల వరకూ బిల్లు వస్తుంది. అంటే.. అటూ ఇటూగా ఐదు వేల వరకూ ఏడాదికి కట్టాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఇప్పుడు..ఆ హామీని అమలు చేస్తే తమకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. వారి ఆశలను కేటీఆర్ వమ్ము చేయాలనుకోలేదు. హైదరాబాద్‌ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ఉచితంగా అందించేందుకు జనవరి నుంచి ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా కేటీఆర్ ప్రకటించారు. డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

 ఓ మాదిరి ఇంటికి… నెలకు ఇరవై వేల లీటర్ల నీరు వాడకం ఉండదు. అంత కన్నా ఎక్కువ ఉంటే.. ఆ పై మొత్తానికి మాత్రమే వసూలు చేస్తారు కాబట్టి.. గ్రేటర్ ప్రజలకు కేటీఆర్ ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేసినట్లుగానే భావించాలి. దీనితో ప్రజలకు తెరాస సర్కార్ మీద నమ్మకం కలగటం ఖాయం. ఎన్నికల్లో గెలవకపోయిన కానీ ఇచ్చిన హామీని నెరవేర్చారు అనే పేరు తెరాస కు వస్తుంది. నిజానికి గ్రేటర్ ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీల్లో బాగా జనాల్లోకి వెళ్లిన హామీ ఇదే, ఓడిపోయిన కానీ దానిని తెరాస ప్రభుత్వం నెరవేర్చటం వలన ఆ పార్టీ క్రేజ్ పెరుగుతుంది.