KTR: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా తరచూ రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే కేటీఆర్ తాజాగా చేవెళ్లలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ కు అనుకోని షాక్ తగిలింది.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతు రుణమాఫీ కూడా ఒకటి అయితే పేరుకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశామని చెప్పారు తప్ప ఎవరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేదంటూ గతంలో ఎన్నోసార్లు కేటీఆర్ రేవంత్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. అయితే తాజాగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఒక వృద్ధ మహిళ దగ్గరకు వెళ్లి నీకు రుణమాఫీ అయ్యిందా అని అడిగారు.
ఇలా కేటీఆర్ అడగడంతో ఆ వృద్ధ మహిళ చెప్పిన సమాధానంతో కేటీఆర్ కు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. నాకు 25వేల రూపాయల రుణమాఫీ జరిగింది అంటూ ఆ వృద్ధ మహిళ తెలియజేశారు. అదేవిధంగా ఇటీవల తాను బ్యాంకుకు వెళ్లి క్రాప్ లోను కూడా తెచ్చుకున్నానని తెలిపారు. అంతేకాకుండా గతంలో మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు కానీ ప్రస్తుతం బస్సు సౌకర్యం కూడా ఉందని తెలిపారు.
ఇలా ఆమె చెప్పిన సమాధానాలతో కేటీఆర్ కి షాక్ తగిలిందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ మేనిఫేస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరుగ్యారంటీల్లో అర గ్యారంటీనే అమలయ్యిందన్నారు. అమలు కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ రైతులను పూర్తిగా మోసం చేసిందని ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు.