ఉప్పెన హీరోయిన్‌తో ఇస్మార్ట్ హీరో ర‌చ్చ రంబోలా.. కాంబినేష‌న్‌పై అభిమానుల‌లో ఆనందం

లెక్క‌ల మాస్టారు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఉప్పెన‌. చిన్న లైన్‌ను బేస్ చేసుకొని సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునామి సృష్టిస్తూనే ఉంది. మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్, అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఈ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రు చాలా మెచ్యూర్డ్‌గా న‌టించారు. మ‌రోవైపు డెబ్యూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను వెండితెర‌పై ఎంతో అద్భుతంగా చూపించారు.

ఉప్పెన సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న అందాల క‌థానాయిక కృతి శెట్టి ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్స్‌తో ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కు గురి చేస్తుంది.తనదైన నటన అభినయంతో కుర్రాళ్ల గుండెల్ని దోచిన ఈ భామకు ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి. ఇప్పటికే సుధీర్ బాబు -ఇంద్రగంటి కాంబినేషన్ మూవీలో నటిస్తుండగా, నాని సరసన శ్యామ్ సింగరాయ్ లోనూ క‌థానాయిక‌గా ఎంపికైంది కృతి. ఈ రెండు సినిమాలు ప్ర‌స్తుతం సెట్స్ పై ఉండగా, ఆ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. అయితే ఇప్పుడు ఉప్పెన బ్యూటీకి ఇస్మార్ట్ స్టార్ ప‌క్క‌న న‌టించే అవకాశం ద‌క్కిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బాక్సాఫీస్‌కు వ‌ణుకు పుట్టించిన హీరో రామ్ రీసెంట్‌గా రెడ్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇక ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం లో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాగా, ఇందులో క‌థానాయిక ఎవ‌ర‌నే విష‌యాన్ని రివీల్ చేయ‌లేదు. ఉప్పెన చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కృతిశెట్టిని రామ్ స‌ర‌సన ఫైన‌ల్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా ఛాన్స్ ద‌క్కించుకుంటే కృతి క్రేజ్ మ‌రో రేంజ్‌కు వెళ్ళ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. రామ్ – లింగుస్వామి చిత్రాన్ని తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంగా రూపొందిస్తుండ‌గా, శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.