K.A Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాల పై స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరిగితే అదే రోజు ఫలితాలు వెలబడాలని లేకపోతే దేశ రాజధాని కి భవిష్యత్తు ఉండదని తెలిపారు. దేశ రాజధానిలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. అలాగే టాప్ టెన్ పొలిటికల్ పార్టీలు మోడీ ముందు లొంగిపోయాయని పాల్ తెలిపారు. మన దేశానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే దిక్కు అంటూ ఈయన తెలిపారు.
ఏ రాష్ట్రంలో అయితే మోడీ అధికారంలోకి వస్తారో ఆ రాష్ట్రంలోని ప్రత్యర్థులు జైలుకు వెళ్లడం ఖాయమని ఈయన తెలిపారు తాను ఇదే విషయం గురించి కేసరి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడానని పాల్ వెల్లడించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కూడా పాల్ మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసులో కూడా నీకు ఈ రాజకీయాలు అవసరమా.నాకు మద్దతిస్తే నేను ఆట మొదలెడతా. మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన చంద్రబాబు కూడా ఇప్పుడు మోదీ పాట పాడుతున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ లో జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన తరువాత నరకం అనుభవిస్తామని పాల్ తెలిపారు. యుద్ధం చేసి అయినా మన తెలుగువాళ్ళను కాపాడుకుంటా అన్నారు.
ఇక తాను రాజ్యసభ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు కూడా ఫాల్ వెల్లడించారు. ఇకపోతే ఈయన జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి షర్మిల వంటి వారే నిలువునాక ముంచేసారని తెలిపారు. జగన్ నువ్వు మోదీకి సరెండ్ అవ్వోద్దు. డిప్రెషన్తో బెంగళూరుకు వెళ్లిన జగన్ కు మనోధైర్యం ఇచ్చామని పాల్ వెల్లడించారు. ప్రాణం పెట్టి పోరాటం చేయమని జగన్మోహన్ రెడ్డికి తాను సలహాలు కూడా ఇచ్చినట్లు పాల్ వెల్లడించారు.