మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, తొలి సినిమా ‘ఉప్పెన’తో నటుడిగా మంచి మార్కులేయించుకున్న విషయం విదితమే. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే, రెండో ప్రయత్నంలో మాత్రం వైష్ణవ్ చేదు ఫలితాన్ని చవిచూడాల్సి రావొచ్చన్న చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
విడుదలకు ముందు ఓ ప్రాజెక్టు మీద అంచనాలు పెరగడం, ఓ సినిమా గురించిన చర్చ అస్సలు సినీ, ప్రేక్షక వర్గాల్లో వినిపించకపోవడమనేది మామూలే విషయమే అయినా, ‘కొండ పొలం’ విషయంలో జరుగుతున్న ప్రచారం, సినిమా పట్ల నెగెటివ్ వైబ్స్ పెరగడానికి కారణమవుతోంది. క్రిష్ డైరెక్షన్, హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్.. ఇవన్నీ ‘కొండపొలం’ సినిమాకి మైనస్.. అనే భావన చాలామందిలో నెలకొంది.
సినిమా ప్రోమో వచ్చాక, వైష్ణవ్ మీద చాలామంది జాలిపడుతున్నారు. ఆ నటన ఏంటి.? ఆ మేకింగ్ ఏంటి.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైష్ణవ్ మాత్రం, సినిమాపై చాలా ధీమాగా వున్నాడు. ‘ఉప్పెన’ విషయంలోనూ విడుదలకు ముందు వైష్ణవ్ చాలా నెగెటివిటీని చూశాడు. సినిమా క్లయిమాక్స్ ఏంటో ముందే తెలిసిపోవడం వల్ల సినిమాపై బజ్ అస్సలు వుండదని అంతా అనుకున్నారు.
కానీ, ‘ఉప్పెన’ విషయం వేరు. పాటలు సూపర్ హిట్ అయ్యాయి.. అదే ఆ సినిమాకి పెద్ద ప్లస్. కొండ పొలం విషయంలో అలా కాదు. పాటలు పెద్దగా ఆకట్టుకోవడంలేదు.. ప్రోమో అస్సలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలేదు. మరి, ద్వితీయ విఘ్నం ఎదుర్కోడానికి వైష్ణవ్ సిద్ధమైపోవాల్సిందేనా.?