మెగా రీమిక్స్.! మేనల్లుడి తాపత్రయం.!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని పాటల్ని రీమిక్స్ చేయడం.. మెగా కాంపౌండ్ హీరోలకి కొత్తేమీ కాదు.! సాయి ధరమ్ తేజ్ ఈ విషయంలో అందరికన్నా ముందున్నాడు.

తాజాగా, మరో మెగా మేనల్లుడు మెగా రీమిక్స్ కోసం ట్రై చేస్తున్నాడన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.! ఆ మెగా మేనల్లుడు ఎవరో కాదు, పంజా వైష్ణవ్ తేజ్ అట.!

ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయనీ, చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకదాన్ని తీసుకుని, అందులోంచి ఓ సెన్సేషనల్ సాంగ్‌ని తనకు అనుగుణంగా కంపోజ్ చేయించుకున్నాడనీ అంటున్నారు.

వాస్తవానికి, పవన్ కళ్యాణ్ సినిమాలోని పాటని రీమిక్స్ చేయాలని తొలుత వైష్ణవ్ అనుకున్నాడట. ఆ తర్వాత అది కాస్తా, మెగా రీమిక్స్‌గా మారబోతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

ప్రస్తుతం ‘ఆదికేశవ’ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా వున్నాడు పంజా వైష్ణవ్ తేజ్.