ఫెడరల్ స్ఫూర్తిపై కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఫెడరల్ స్ఫూర్తికి పై కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదు అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై త్వరలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది అని.. గవర్నర్ చేస్తున్న దాంట్లో తప్పు లేదు అన్నారు.

అంతే కాకుండా తెలంగాణలో ఏం సాధించారని జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ వెళ్తున్నారు అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పలువురు రాజకీయ నాయకులను తెలంగాణ పై దృష్టి పెట్టక వాటిపై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు.