న‌గ్నంగా నటించిన కోలీవుడ్  హీరోయిన్

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. హీరోయిన్ లు అందచందాలు చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య గ్లామర్ షో కొంచెం ఎక్కువైంది కానీ న్యూడ్ గా మాత్రం ఏ హీరోయిన్ నటించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా ఒక సినిమాలో న్యూడ్ గా నటించినట్టు తెలుస్తుంది. ఈ వార్త‌ల‌పై రీసెంట్‌గా డైరెక్ట‌ర్ మిస్కిన్ రియాక్ట్ అయ్యారు. ”పిశాచి 2లో ఆండ్రియా న్యూడ్‌గా న‌టించిన మాత్ర‌మే నిజ‌మే. అయితే వాటిని ఫొటోలుగానే తీశాం. కానీ స‌న్నివేశాలుగా చిత్రీక‌రించ‌లేదు. ఓ లేడీ ఫొటోగ్రాఫ‌ర్ మాత్ర‌మే ఆ ఫొటోల‌ను తీసింది. అలా చేయ‌టానికి ఆండ్రియా ఎక్కువ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంది.

కుటుంబంతో స‌హా సినిమా చూసే వారికి ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఉంటే ఇబ్బందిక‌రంగా ఉంటాయ‌న‌టంలో డౌట్ లేదు. అందుక‌ని ఆ ఫొటోల‌ను సినిమాలో చూపించ‌లేదు. సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరం కూడా వ‌స్తుంద‌ని ఫొటోల‌ను చూపించకుండా డిలీట్ చేసేశాను” అని అన్నారు మిస్కిన్. ఆగస్ట్ 31న పిశాచి 2 రిలీజ్ అవుతుంది. సినిమా వాయిదా పడే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. 8 ఏళ్ల ముందు వచ్చిన  ‘పిశాచి’ సినిమాకి  ఇది సీక్వెల్ .