Actress: కుర్ర హీరోలకు  మిడ్ నైట్  పార్టీలు..   మత్తులో  హీరోయిన్ చిత్తు !   

Actress:  ఆండ్రియా జర్మియా సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  హీరోయిన్ గా మారింది. లక్కీగా మొదటి సినిమా హిట్ అయినా, ఆ తర్వాత ఏడాది వరకూ ఆండ్రియాకి  అవకాశాలు రాలేదు. అరె అమ్మడు అందంగా ఉంది, పైగా  పొడగరి, సొగసరి అంటూ ఆండ్రియాకు మంచి పొగడ్తలు లభించాయి. కానీ, ఆ సమయంలో ఆండ్రియాకు పెద్దగా  ఛాన్స్ లు రాలేదు.  వచ్చిన ఛాన్స్ లు కూడా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్సే.  అవి చేస్తున్న సమయంలోనే ఆండ్రియా ట్రాక్ తప్పింది.  ఓ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ తో ఏర్పడిన పరిచయం కారణంగా, ఆండ్రియా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.

 మధ్యలో డ్రగ్స్ కి అలవాటు పడింది.  కానీ, అంతలో ఆండ్రియాకు వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలకు తోడు హిట్స్  కూడా పడ్డాయి. కట్ చేస్తే.. ఆండ్రియా  హీరోయిన్ గా సౌత్ లో బిజీ అయింది. ఈ క్రమంలో మంచి సినిమాలు చేసింది.  మంచి నటి అనిపించుకుంది. పైగా హీరోలతో చక్కని అనుబంధాన్ని కూడా మెయింటైన్ చేసింది. మొత్తానికి ఆండ్రియా  కెరీర్ లో మధ్యలో బాగానే జరిగింది.

అయితే ఎందుకో అంతా బాగానే ఉన్నా, ఆండ్రియా మాత్రం తనకు అలవాటు అయిన ఆ డ్రగ్స్ మత్తు నుండి బయటపడలేక పోయింది. ఇంత గొప్ప  అందమైన అమ్మడికి  అలాంటి  అలవాటు  ఏమిటి ? అంటూ తోటి  సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. పైగా ఆండ్రియా  తన అలవాటును పబ్లిక్ చేసేసుకుంది. మొదట్లో దీన్ని ఎవ్వరూ పట్టించుకోకపోయినా  ఆ తర్వాత మాత్రం ఆమెను మీడియం రేంజ్ హీరోలు కూడా  దూరం పెట్టారు.

అప్పటికీ గానీ ఆండ్రియాకు తత్వం బోధపడలేదు.  మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా తనకు  స్టార్ హీరోలతో కూడా మంచి  పరిచయాలే ఉన్నాయి. ఫోన్ చేసి ఛాన్స్ లు అడిగినా ఆండ్రియాకు ఎవ్వరూ ఛాన్స్ లు ఇవ్వలేదు.  అప్పుడప్పుడు తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నా.. ఆండ్రియా కి  ఈ మధ్య  ఫ్రీ టైం మరీ ఎక్కువ అయింది.  దాంతో ఆండ్రియా  తాజాగా తన అలవాటును మళ్ళీ మొదలెట్టిందట.  పైగా తన ప్లాట్ లోనే  ఆండ్రియా  కుర్ర హీరోలకు  మిడ్ నైట్  పార్టీలు ఇస్తూ.. వారికీ  మంచి కిక్ ను ఇస్తోందని,  ఆమె గురించి తెలిసిన ఆండ్రియా సన్నిహితులే గుసగుసలాడుతున్నారు.  మరి ఇది ఇలాగే కంటిన్యూ అయితే,  ఇక ఆండ్రియా  కెరీరే కాదు, లైఫ్ కూడా రిస్క్ లో పడినట్టే.