కోలీవుడ్ నటుడు రాజేందర్ కు గుండెపోటు.. ట్విట్టర్ వేదికగా స్పందించిన శింబు!

కోలీవుడ్ సీనియర్ నటుడు టి.రాజేందర్ కు తాజాగా గుండెపోటు రావడంతో ఈ విషయం గురించి ఆయన కొడుకు, హీరో శింబు తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తన అరుయిర్ అభిమానులకు, ప్రియమైన పత్రిక, మీడియా మిత్రులకు నమస్కారం అని.. తన తండ్రికి ఛాతి నొప్పి రావడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించానని.. అక్కడ పొత్తికడుపులో స్వల్ప రక్తస్రావం కావడంతో వెంటనే విదేశాలకు తీసుకెళ్తున్నారు అని అన్నాడు.

ఇక ఆయన స్పృహలోనే ఉన్నాడు అంటూ.. వీలైనంత త్వరగా ఆయన ట్రీట్మెంట్ ముగించుకొని మీ ముందుకు వస్తారు అని.. మీ ప్రార్థనలకు, అందరి ప్రేమలకు ధన్యవాదాలు అని అన్నాడు. ఇక అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.