స్థానిక ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎంపీ రామ్మోహనాయడు, ఆ పార్టీ సీనియర్ నేత కొల్లు రవీందర్ సహా పలువురు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచరాణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని తీర్పునిచ్చింది. 2010 లో కె. ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని మరోసారి సుప్రీం స్పష్టం చేసింది. దీంతో పచ్చ తమ్ముళ్ల ఆత్రానికి బ్రేక్ పడింది.
సరిగ్గా స్థానిక ఎన్నికలకు నగరా మ్రోగడానికి ఆసన్నమవుతోన్న సమయంలో సుప్రీం షాక్ తో పచ్చ తమ్ముళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీరని ద్రోహం చేసారని..జగన్ బీసీ ద్రోహి అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. రిజర్వేషన్ల కల్పనపై సుప్రీం కోర్టులో సరైన వాదనలు వినిపించలేదని ఆరోపించారు. సుప్రీం తీర్పుతో బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో వైకాపా నేతలతో కేసులు వేయించారని ఇదంతా ఉద్దేశ పూర్వకంగా జరిగిందని ఆరోపించారు.
రిజర్వేషన్ల కోత వల్ల 16 శాతం వేల మంది బీసీలు స్థానిక సంస్థల్లో నాయకత్వానికి దూరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ర్ట జనాభాలో 50 శాతం బీసీలు ఉంటే వీళ్ల పెత్తనం ఏంటని ద్వజమెత్తారు. పలు అంశాల్లో అర్డినెన్స్ లు తీసుకొచ్చి అమలు చేసిన ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలేదని ప్రశ్నించారు. అయితే కొల్లు వ్యాఖ్యలపై వైకాపా నేతలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇది ఏపీ ఒక్క రాష్ర్టంలో ఉన్న సమస్య కాదని, ఇతర రాష్ర్టల్లోనూ ఇలాంటి సమస్యలున్నాయన్నారు. సుప్రీం కోర్టు అన్ని రాష్ర్టాల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకునే తీర్పునిచ్చిందన్నారు. ప్రభుత్వం తరుపున వినిపించాల్సిన వాదనలు విన్న తర్వాత సుప్రీం తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆ మాత్రం తెలియకుండా కొల్లు కల్లు తాగిన కోతిలా మాట్లాడటం భావ్యం కాదన్నారు.