అక్కడే గెలుస్తా.. అక్కడే మట్టిలో కలిసిపోతా: కొడాలి నాని

తాజాగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈయన 2004 నుంచి కృష్ణా జిల్లాగుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి అక్కడ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

తనది గుడివాడ అంటూ.. 2004లో, 2009లో, 2014లో, 2019లో గెలిచాను అంటూ.. 2024లో కూడా గెలుస్తానని అంతేకాకుండా 2029 లో కూడా గెలుస్తానని.. ఇక్కడే పుట్టానంటూ.. ఇక్కడ చనిపోతాను అంటూ.. ఇక్కడే మట్టిలో కలిసిపోతాను అని అన్నారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారాయి.