టమాటా జ్యూస్ చేసే మేలు తెలిస్తే తాగకుండా ఉండలేరు?

మనకు ప్రకృతిలో లభించే అన్ని కూరగాయలలో టమోటాలు కూడా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు మనం తయారు చేసుకునే వంటలలో టమాటాలను కచ్చితంగా ఉపయోగిస్తాము. టమోటాలు ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేయడం వల్ల ఆహారం రుచిగా మారటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు టమోటాలలో ఎక్కువగా ఉంటాయి. టమాటాలను మనం తయారు చేసుకునే ఆహార పదార్థాలలో మాత్రమే కాకుండా జ్యూస్ లా తయారు చేసుకుని తాగటం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. టమాటా జ్యూస్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

*టమాటాలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా టమాటలలో యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపిన్, బీటా కెరటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు టమాటా జ్యూస్ తాగటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.

*అంతేకాకుండా ఈ టమాటా జ్యూస్ లో ఉండే విటమిన్ సి, బీటా కెరటిన్ కంటి చూపును మెరుగుపరిచి కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

*టమాటాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. తరచూ టమాటా జ్యూస్ ని తాగటం వల్ల అందులో ఉండే ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి మలినాల ద్వారా బయటికి పంపుతుంది. ఈ క్రమంలో అధిక బరువు సమస్యను కూడా నియంత్రణలో ఉంచవచ్చు.

*తరచూ టమాటా జ్యూస్ తాగటం వల్ల ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని తొలగించి మూత్రపిండాలు కాలేయం పనితీరును మెరుగుపడేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది గుండే ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా చాలా ఉపయోగపడుతుంది.