OTT Movie: అయ్యబాబోయ్..బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న సినిమా.. 5 రోజుల్లోనే అన్ని వేల కోట్లు!

OTT Movie: ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల కలెక్షన్ ల జాతర జరుగుతోంది. ఒక సినిమానీ మించి ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. కాగా ఇటీవల విడుదల అయిన అమీర్ ఖాన్ సీతారే జమీన్ పర్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభించింది. ఈ సినిమా మంచి కలెక్షలను సాధిస్తూ దూసుకుపోతుండగా ఈ సినిమాకు గట్టి షాక్ ను ఇస్తూ ఇటీవల విడుదల అయిన ఒక సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా దాదాపుగా ఐదు రోజుల్లోనే రూ.2,700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఐదు రోజుల్లో ఇన్ని కోట్లు సాధించడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇంతకీ ఆ సినిమా ఏది అని అనుకుంటున్నారా, ఆ సినిమా మరేదో కాదండోయ్ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఇటీవల జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కాగా జూలై రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది అని చెప్పాలి. భారతదేశంలో దాదాపుగా 50 కోట్ల దిశగా ఈ సినిమా పయనిస్తోంది. మొదటి రోజు రూ. 9 కోట్లు, రెండవ రోజు రూ. 13.5 కోట్లు, మూడవ రోజు రూ. 16 కోట్లు వసూలు చేసింది. ఇలా రోజురోజుకీ కలెక్షన్లను పెంచుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా.

కాగా ఇప్పటివరకు ఈ సినిమా రూ.2.23 కోట్లు, మొత్తం రూ.41.23 కోట్లు వసూలు చేసింది. అలా ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్, మెట్రో ఇన్ డినో చిత్రాలను బీట్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని రూ.1540 కోట్లతో నిర్మించగా 5 రోజుల్లోనే రూ.2734 కోట్లు రాబట్టింది. ఈ డైనోసార్ నేపథ్య చిత్రం బ్రాడ్ పిట్ నటించిన F1 చిత్రాన్ని వారాంతపు ఆదాయంలో సగం కంటే ఎక్కువగా వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇంకా ముందు ముందు ఎన్ని కోట్లు కలెక్షన్స్ నీ సాధిస్తుందో అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇకపోతే ఇందులో మహర్షల అలీ, స్కార్లెట్ జోహన్సన్ ముఖ్యపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. దర్శకుడు గారెత్ జేమ్స్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.