K.K. Survey: ఏడాది కూటమిపాలన పై కేకే సర్వే… డేంజర్ జోన్ లో ఉన్న నేతలు?

K.K.Survey: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు రావడం, కూటమి పార్టీలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత దాదాపు అన్ని సర్వే సంస్థలు వైసిపి గెలుస్తుందని చెప్పాయి కానీ కేకే సర్వే మాత్రం కూటమి పార్టీలో 160 స్థానాలకు పైగా విజయం సాధిస్తాయని చెప్పడంతో ఒక్కసారిగా కేకే సర్వే సంచలనంగా నిలిచింది. ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కేకే సర్వే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఏకంగా 164 స్థానాలలో విజయం సాధించింది.

ఇలా కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావడంతో కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి వార్తలలో నిలిచారు.ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై కూడా తమ విశ్లేషణను పంచుకుంది.తాజాగా ‘పారావీల్’ అనే తమ నూతన రియల్ టైమ్ పబ్లిజెన్స్ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ కొండేటి మాట్లాడుతూ..జూన్ 4వ తేదీ తమ సంస్థకు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. ఇక ఇదే రోజున మేము వెల్లడించిన సర్వే 100% నిజం అయిందని గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది పాలనపై కేకే సర్వే షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఆంధ్ర ప్రదేశ్లో దాదాపు కూటమి ఎమ్మెల్యేల ఓటు బ్యాంకు 30% తగ్గిందని కేకే సర్వే వెల్లడించింది.ప్రస్తుతం తాము సేకరించిన డేటా ప్రకారం, 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏర్పడిందని కిరణ్ కొండేటి వెల్లడించారు. అయితే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ విషయంలోనే కూటమి పార్టీ ఎమ్మెల్యేలకు ఓటు బ్యాంకు తగ్గిందని స్పష్టమవుతుంది.