K.K Survey: ఏపీలో సంచలనం రేపిన కేకే సర్వే…. ఢిల్లీ ఫలితాలలో మాత్రం బోల్తా కొట్టిందిగా?

K.K Survey: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అందరికీ ఎంతో ఆసక్తికరంగా మారాయి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఒకసారి కూడా బిజెపి అధికారంలోకి రాలేదు కానీ ఈ ఎన్నికలలో మాత్రం అధికారాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి కానీ కేకే సర్వే మాత్రం ఆప్ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు.

ఈ విధంగా ఢిల్లీలో మరోసారి ఆఫ్ అధికారంలోకి వస్తుందని కేకే సర్వే వెల్లడించడంతో చాలామంది తిరిగి మరోసారి ఢిల్లీ పీఠం ఆల్ పార్టీదేనని అందరూ భావించారు. కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో కేకే సర్వే పూర్తి స్థాయిలో బోల్తా పడిందని తెలుస్తోంది. ఏపీలో కేకే సర్వే ఫలితాలు ప్రభంజనం సృష్టించాయి అన్ని పార్టీలు దాదాపు జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పినప్పటికీ ఒక కేకే సర్వే మాత్రం 160 సీట్ల వరకు కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఇక ఏపీ ఎన్నికల విషయంలో కేకే సర్వే సక్సెస్ అయింది అలాగే మహారాష్ట్రలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని కేకే సర్వే తెలిపారు. ఇలా అన్ని రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలలో కేకే సర్వే చెప్పిన విధంగానే ఫలితాలు వచ్చాయి కానీ ఢిల్లీలో మాత్రం కేకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కాలేకపోయాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 39 ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని కేకే సర్వే స్పష్టం చేస్తుంది. ఇక బీజేపీ మాత్రం 22 స్థానాలనకే పరిమితం అవుతుందని తెలిపింది. అలాగే 9 స్థానాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య పోరు రసవత్తరంగా జరగనుందని తెలిపింది.

నేడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కేకే సర్వే ఫలితాలు పూర్తిగా తారుమారు అయ్యాయని తెలుస్తోంది.ఢిల్లీఅసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసి మరి బీజేపీ లీడింగ్ లో కొనసాగుతుంది.. ఈ సారి ఎలాగైనా అధికారం పొందాలనే దృఢ నిశ్చయంతో బీజేపి వుంది.