K.K.Survey: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దాదాపు 160 స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పిన సర్వేలలో కేకే సర్వే ఒకటి. మిగతా అన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందని టిడిపి గెలుస్తుందని అంచనాలు వేశారే తప్ప కేకే సర్వే మాత్రం ఏకంగా 160 స్థానాలలో కూటమి విజయం సాధిస్తుందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక కూటమి పార్టీలు ఏకంగా 164 స్థానాలలో విజయం సాధించడంతో కేకే సర్వే 100% నిజమైందని నిరూపించింది. ఇకపోతే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ ఏడాది పాలన పట్ల కేకే సర్వే సమస్థ కూటమి ఏడాది పాలన గురించి పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమిపాలనపై కాస్త వ్యతిరేకత మొదలైందని కేకే సర్వే వెల్లడించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేదా మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగినా కొత్తగా గెలిచిన 40 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓటమిపాలు అవుతారని తెలిపారు. ఇలా 40 మంది ఎమ్మెల్యేలు ఓటమిపాలు కావడానికి కారణం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవటమేనని తెలిపారు.
ఇప్పటికైనా కూటమినేతలు ఈ విషయంపై శ్రద్ధ చూపెడుతూ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే కూటమి ఈ ఇబ్బందుల నుంచి బయట పడుతుందని, లేకపోతే మొదటికే మోసం వస్తుందని చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేకే సర్వే సంస్థ వెల్లడించింది. అయితే గతంలో కూటమి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పిన కేకే సర్వే ఇప్పుడు ప్రజలలో కూటమిపై వ్యతిరేకత మొదలైందని చెప్పటం గమనార్హం. ఇలా ఏడాదికే కూటమి పట్ల వ్యతిరేకత రావడంతో కూటమినేతల వ్యవహార శైలి ఇలాగే ఉంటే ముందు ముందు ఇబ్బందులు తప్పవని చెప్పకనే చెప్పేస్తున్నారు.