YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోర ఓటమి ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. 2019 ఎన్నికలలో సింగిల్ గా 151 స్థానాలలో గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికలలో ఈయన కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఒక్కసారిగా వైసీపీ అభిమానులు కార్యకర్తలు షాక్ కి గురి అయ్యారు.
ఇలా తన పార్టీ ఘోరంగా ఓటమి పాలు అయినా పార్టీ నుంచి ఎంతోమంది కీలక నేతలు బయటకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతో ధైర్యంగా నిలబడి తిరిగి పార్టీని పునర్నిర్మించడానికి కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలలోనూ అలాగే నాయకులలో ఎంతో భరోసా నింపుతున్నారు అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి 2.0 గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ ఇటీవల మాట్లాడారు అసలు ఆయన దృష్టిలో 2.0 అంటే ఏంటి అనే విషయం గురించి అర్థం తెలిపారు. జగన్ 2.0 అంటే.. గత ఎన్నికల్లో నాకొచ్చింది 11. వాటి మొత్తం 2, వాటి బేధం 0. 2.0 అంటే 2029లో వారికి వచ్చే సీట్లు 0… అని జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారని ఆర్పీ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి కిరాక్ ఆర్పి ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది వైకాపా కార్యకర్తలు ఆర్పీ వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు. మొదటిసారి ప్రజలకు సేవ చేయాలని కార్యకర్తలను కాస్త దూరం పెట్టాను కానీ ఈసారి జగన్ కార్యకర్తల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తానని మరో 30 ఏళ్ల పాటు అధికారంలో మనమే ఉంటామని జగన్ తెలిపారు.
ఇలా జగన్ 2.0 గురించి మాట్లాడటంతో వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వంటి వారందరూ కూడా జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తమదైన శైలిలోనే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇక మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జగన్ మాటలను ఏమాత్రం అలుసుగా తీసుకోవద్దని జాగ్రత్త వహించడం మంచిది అంటూ కూటమినేతలకు హెచ్చరిస్తున్నారు.