Kirak RP: పోలీసులు రోజాను కూడా అక్కడే అరెస్టు చేస్తారు… కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు!

Kirak RP: 2024 ఎన్నికలలో వైకాపా పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చాయి. ఇలా కూటమి పార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైసిపి నేతలపై వరుస అరెస్టులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూటమి నేతలు అయిన పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు వంటి వారి పై తీవ్ర స్థాయిలో అసభ్యకర అభ్యంతరకర పదజాలాలను ఉపయోగిస్తూ విమర్శించారు.

ఈ విధంగా గత ప్రభుత్వ హయామంలో కూటమినేతల గురించి విమర్శించిన వారందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి కూడా అరెస్టు అయ్యారు. ఇక త్వరలోనే మరి కొంతమంది కూడా అరెస్టు కాబోతున్నారు అంటూ కూటమి నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలోనే కమెడియన్ కిరాక్ ఆర్పీ ఇటీవల వైసిపి నేతల అరెస్టు గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు. మీడియా వారు హైదరాబాదులోని మై హోం భుజా వద్ద ఓ టెంట్ వేసుకొని కూర్చోవాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ అక్కడే దొరికాడు. పోసాని కృష్ణమురళి అక్కడే పోలీసులకు దొరికారు. ఇక నెక్స్ట్ మాజీ మంత్రి రోజను కూడా పోలీసులు అక్కడే అరెస్టు చేస్తారు ఆమె తర్వాత అంబట రాంబాబు కొడాలి నాని , ఆనీల్ కుమార్ యాదవ్ వంటి వారందరూ కూడా ఇక్కడే పోలీసులకు దొరుకుతారని ఆర్పీ తెలిపారు.

హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అదే. ఆధునిక హంగులు, సౌకర్యాలతో ఉంటుంది. రానున్న రోజులకు సరితూగే టెక్నాలజీతో ఆ అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు . 2024 ఎన్నికలలో తమ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని అయోమయంలో ఎంతో మంది వైసీపీ నేతలు ఇక్కడే ఫ్లాట్స్ కొనుగోలు చేశారని, ఐదేళ్లలో సంపాదించిన అవినీతి మొత్తం ఇక్కడే పెట్టుబడి పెట్టారని ఆర్ పీ తెలిపారు అందుకే మీడియా వారు ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటే పోలీసులు వరుసగా వైసీపీ వాళ్లను అరెస్టు చేస్తూ తీసుకెళ్తారని ఆర్పీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.