Kiran Royal: జనసేన నేత కిరణ్ రాయల్ తో రాజీ పడిన లక్ష్మీరెడ్డి… డబ్బే సమస్యను తీర్చిందా?

Kiran Royal: జనసేన నేత తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈయన జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు వైఎస్ఆర్సిపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తరచు వార్తలు నిలిచారు. ఇలాంటి తరుణంలోనే కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి అనే అమ్మాయితో చాలా చనువుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వీడియో బయటకు రావడంతో ఈయన పేరు మారుమోగిపోయింది.

ఇక ఈ వీడియో తర్వాత లక్ష్మి కిరణ్ రాయల్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు. ప్రేమ పేరుతో నా జీవితాన్ని నాశనం చేశారని నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాగేసుకున్నారు అంటూ వరుసగా ఈమె ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా వీరి వ్యక్తిగత వీడియోలు కూడా బయటకు రావడంతో ఈ విషయంపై జనసేన అధినేత సైతం స్పందించారు.

కిరణ్ రాయల్ కొంతకాలం పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అంటూ జనసేన ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా తిరుపతిలో లక్ష్మీ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె కిరణ్ రాయల్ తో రాజీకీ వచ్చినట్టు తెలియజేశారు. తమ మధ్య లావాదేవీలు ఓ కోలిక్కి వచ్చాయని తెలిపారు అయితే మా వ్యవహారంపై రెండు పార్టీలు రాజకీయంగా మార్చుకొని మమ్మల్ని ట్రోల్ చేశారని లక్ష్మి విమర్శించారు.

ఇక నేను సోషల్ మీడియాలో షేర్ చేసింది కేవలం ఒక్క వీడియో మాత్రమేనని తెలిపారు. జనసేన నేత నా వద్ద నుంచి ఈ వీడియోలు తీసుకున్నారని ఆ వీడియోలను వాళ్లే సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు. ఇక ఈ వ్యవహారంలో జనసేన నేత హస్తము ఉన్నట్లు ఈమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పెద్ద వివాదం తరువాత తిరిగి కిరణ్ రాయల్ తో రాజీకీ వచ్చినట్టు ఈమె వెల్లడించడంతో ఈ వివాదానికి పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.