Kiran Abbavram: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా కొనసాగుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే తాజాగా నటుడు కిరణ్ అబ్బవరం తండ్రిగా ప్రమోట్ అయ్యారని తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం నటి రహస్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు నెలలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా వివాహం జరిగిన కొద్ది నెలలకే ఈ దంపతులు శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల రహస్య సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే తాజాగా నటి రహస్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తన కొడుకు కాలును ముద్దాడుతూ ఉన్నటువంటి ఫోటోని కిరణ్ అభవరం షేర్ చేస్తూ… తన భార్య రహస్య కొద్ది సేపటి క్రితమే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.తనకు చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడని, ఆయన పుట్టినరోజునే మా ఇంట కొడుకు జన్మించడం స్వయంగా హనుమంతుడే మా ఇంటికి వచ్చినట్టు ఉందని పేర్కొన్నాడు.
హనుమాన్ జయంతి రోజునే తాను కూడా తండ్రి కావడం తనకు చాలా సంతోషంగా ఉందనీ జై శ్రీరామ్ అంటూ కొడుకు కాళ్ళని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు. కాగా కిరణ్, రహస్య రాజా వారు రాణి గారు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారడంతో అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.