Kiran abbavaram: సినీ నటుడు కిరణ్ అబ్బవరం గత ఏడాది ఆగస్టులో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈయన పెళ్లయిన కొద్ది నెలలకే తన భార్య తల్లి కాబోతుంది అంటూ శుభవార్తను అందరితో పంచుకున్నారు ఇలా తన భార్య బేబీ బంప్ ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా కిరణ్ అబ్బవరం రహస్య జంటకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ అబ్బవరం తన భార్య బేబీ బంప్ తో ఉన్న మరి కొన్ని ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఇటీవల శివరాత్రి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు అందరూ కూడా వారి శివరాత్రి వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం రహస్య ఇద్దరు కూడా శివరాత్రి పండుగను పురస్కరించుకొని కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలకు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి బేబీ బంప్ తో చీర కట్టులో రహస్య ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. ఇలా వీరిద్దరు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.