Roja: రోజా పరిచయం అవసరం లేని పేరు. సినీనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రోజా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసేవారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతోమంది ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక రోజుకు మంత్రి పదవి రావడంతో తనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు.
ఇలా రోజా పూర్తిగా రాజకీయాలలో ఉన్న నేపథ్యంలో కొంతమంది సినీ ఆర్టిస్టులు కూడా పలు పార్టీలకు మద్దతు తెలుపుతూ రోజాపై విమర్శలు చేశారు. ఇలా రోజా గురించి విమర్శలు చేసిన వారిలో కిరాక్ ఆర్పీ మొదట స్థానంలో ఉన్నారు. అయితే ఈయన రోజా గురించి ఇష్టానుసారం మాట్లాడినప్పటికీ మిగతా జబర్దస్త్ కమెడియన్లు ఎవరు కూడా స్పందించలేదు. అయితే ఇలా స్పందించకపోవడానికి గల కారణం ఏంటి అంటూ ఇటీవల మరొక జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ కు ప్రశ్న ఎదురయింది.
బుల్లెట్ భాస్కర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురవడంతో ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.జబర్దస్త్ అంతా ఒకటే ఫ్యామిలీ. కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలకు సంబంధించింది. జబర్దస్త్ కి సంబంధించిన విషయం కాకపోవడంతో మేము ఎవరు స్పందించడం లేదు. ఒక ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కరు కావాలి తప్ప మేము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తామని ఎప్పుడు చెప్పకూడదు. రాజకీయాలు అనేది ఒక పెంట… అలాంటి దాని జోలికి వెళ్లకూడదు.
ఆర్టిస్ట్ అనేవాడు అందరిని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ వెళ్లాలి తప్ప పలానా పార్టీకే సపోర్ట్ చేస్తానని చెప్పకూడదు. నేను ఒకసారి నా ప్రమేయం లేకుండా నా తప్పు లేకుండానే నేను ఏదో ఒకే పార్టీకి సపోర్ట్ చేశాను అంటూ నన్ను చాలా ఇబ్బందులకు గురించేశారు. ఫోన్లు చేస్తూ మరీ బెదిరించారు అక్కడ నా తప్పులేదు కానీ నన్ను టార్గెట్ చేశారు. చివరికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. అందుకే రాజకీయాల జోలికి మేము వెళ్ళమని, అందుకే రాజకీయాల పరంగా ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించలేదని క్లారిటీ ఇచ్చారు.