సుధీర్, రష్మీ మధ్య ఉన్న ప్రేమ గురించి అసలు విషయం బయటపెట్టిన కిరాక్ ఆర్పీ!

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది స్టార్ కమెడియన్లు గా గుర్తింపు పొందారు . ఇలా జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో కిరాక్ ఆర్పి కూడా ఒకరు. తినటానికి తిండి లేక హోటల్లో సర్వర్ గా పనిచేస్తున్న ఆర్పీకు జబర్దస్త్ లో అవకాశం దక్కింది. ఈ షో ద్వారా ఆర్పీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే కొంతకాలం క్రితం ఆర్పి తనకు ఇంతటి గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ షో ని విడిచి వెళ్లిపోయాడు.

ఆర్పీ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు. ఇటీవల తను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న ఆర్పీ.. తనకి కాబోయే భార్యతో కలిసి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆర్పీ జబర్దస్త్ గురించి ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టాడు. ఈ క్రమంలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుధీర్, రష్మీ జంట గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. జబర్దస్త్ లో లవ్ ట్రాక్ వల్ల సుధీర్, రష్మీ జంట బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ స్టేజి మీద ఎంతో స్నేహంగా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారం అయ్యాయి. అంతేకాకుండా జబర్దస్త్ లో ఎన్నోసార్లు వీరిద్దరికీ పెళ్లి చేశారు.

అయితే ప్రేమ, పెళ్లి విషయాల గురించి సుదీర్, రష్మీ స్పందిస్తూ అదంతా కేవలం ఛానల్ టిఆర్పి కోసం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. సుధీర్ జబర్దస్త్ మానేసిన తర్వాత కూడా వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పి సుధీర్ రష్మీ జంట గురించి మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని కేవలం ఛానల్ టీఆర్పి కోసం మాత్రమే వాళ్ళు అలా నటిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో జబర్దస్త్ యాజమాన్యం మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.