కింగ్ నాగార్జున’ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్ ఆగస్టు 25న విడుదల

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున.

ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు – ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని అబ్బురపరిచాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ కంటెంట్, నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించడం సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఇప్పుడు అందరి దృష్టి ది ఘోస్ట్ ట్రైలర్‌పైనే పడింది. ఎట్టకేలకు ట్రైలర్ డేట్ ప్రకటన వచ్చింది. ఆగస్ట్ 25న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్‌లో మరింత ఎక్సయిటింగ్ యాక్షన్‌ ని చూడబోతున్నాం.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగార్జున, సోనాల్ చౌహాన్ శిధిలమైన ఓ పెద్ద భవంతిలో నిలబడి వుండటం.. చిత్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను సూచిస్తుంది. నాగార్జున ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ పట్టుకొని డాషింగ్ అండ్ సూపర్ ఫిట్‌గా కనిపించగా, సోనాల్ చేతిలో కూడా గన్ వుండటం పోస్టర్ లో గమనించవచ్చు. నాగార్జున కిల్లర్ లుక్స్, యాక్షన్ సెటప్ అద్భుతంగా వుంది. ఈ పోస్టర్ అభిమానులు, ప్రేక్షకుల అంచనాలని, సినిమా ప్రమోషన్స్‌ను మరింత పెంచింది.

ది ఘోస్ట్ ఎమోషన్స్ కూడిన యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయిక. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ, భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు