మెగా ఫ్యామిలీలో మరో డిజాస్టర్‌… ‘గాండీవధారి అర్జున’ ఫ్లాప్‌!

సరైన కథ, దర్శకుడు పడాలే కానీ.. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ గ్రాఫ్‌ దూసుకెళ్తుంది. వరుణ్‌ కెరీర్‌ ముందునుంచీ ఎక్కువగా మాస్‌, యాక్షన్‌ కథల జోలికి వెళ్లకుండా ప్రేక్షకులకు సరికొత్త థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే విధంగా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తుంటాడు. వరుణ్‌ కెరీర్‌లో ఒకటి, రెండు సినిమాలు తప్పితే మిగితావన్నీ అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ కంటెంట్‌ సినిమాలే. అలాంటి నటుడిను వరుస ప్లాప్‌లు వెంతడుతున్నాయి.

వరుణ్‌ ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం మాత్రం రావడం లేదు. యావరేజ్‌గా ఉన్నా ఒకే కానీ.. మరీ డిజాస్టర్‌ మాటలు వినిపించడంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. టీజర్‌, ట్రైలర్‌లు గట్రా ‘గాండీవధారి అర్జన’పై మంచి హైపే క్రియేట్‌ చేసింది. అయితే ఆ హైప్‌ జనాలను థియేటర్‌ల వరకు కూడా రాలేనివ్వలేకపోయింది. ‘గని’ చిత్రానికి కనీసం డీసెంట్‌ కలెక్షన్‌లైనా వచ్చాయి.. కానీ అర్జునకు మాత్రం పోస్టర్‌ ఖర్చులను కూడా తీసుకురాలేకపోయింది.

రెండు ఏళ్లు ఒళ్లు హూనం చేసుకుని ఎంతో కష్టపడి చేసిన ఈ చిత్రం .. పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఈ సినిమా గాయం మర్చిపోకముందే ఎఫ్‌`3 రూపంలో మరో బిగ్‌ షాక్‌ తగిలింది. వెంకీమామతో కలిసి చేసిన ఈ సినిమా ఘోరంగా ప్లాప్‌ అయిపో యింది. ఇక ఇటీవలే విడుదలైన ‘గాండీవధారి అర్జున’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వరుణ్‌ తేజ్‌ స్టైలిష్‌ మేకోవర్‌, కథ రెండూ బాగానే ఉన్నా.. కథనం సరిగ్గా లేకపోవడం.. చాలా వరకు సీన్స్‌ బోర్‌ కొట్టించడంతో తొలి రోజే నెగెటివిటీ వచ్చేసింది.

దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పట్టుమని పది కోట్ల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఇలా వరుణ్‌ కష్టం అంతా బూడిదలో వేసిన పన్నీరులా అయిపోయింది. ఇలా నెల రోజుల గ్యాప్‌లోనే మెగా కాంపౌడ్‌ నుంచి వచ్చిన బ్రో, భోళా శంకర్‌, అర్జున సినిమాలు ఘోరంగా ప్లాప్‌ అవడంతో మెగా అభిమానుల బాధ అంతా ఇంతా కాదు.

ఇక ప్రస్తుతం వరుణ్‌ ఆశలన్నీ డిసెంబర్‌లో విడుదలయ్యే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ పైనే ఉన్నాయి. సూర్య ప్రతాప్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏయిర్‌ ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. మనూషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతుంది. మరీ ఈ సినిమానైనా మెగా ప్రిన్స్‌కు కలిసి వస్తుందో లేదో చూడాలి.