మూడు సినిమాల ముచ్చట..ముగిసిందా?

గతవారం మూడు సినిమాలు విడుదలయ్యాయి అందులో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు , వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ’గాండీవధారి అర్జున’ కూడా వుంది. అలాగే కార్తీక్‌ గుమ్మకొండ , నేహా శెట్టి జంటగా నటించిన ’బెదురులంక 2012’ విడుదలైంది, వీటితో పాటు మలయాళం స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ’కింగ్‌ అఫ్‌ కొత్త’ కూడా విడుదలైంది.

ఇంకా మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఇందులో చెప్పుకోవలసిన సినిమాగా వరుణ్‌ తేజ్‌ సినిమా వుంది. ఎందుకంటే విడుదలకి ముందు ఈ సినిమా చాలా స్టైలిష్‌ యాక్షన్‌ సినిమాగా, అలాగే వరుణ్‌ తేజ్‌ కి ఒక మంచి బ్రేక్‌ కావాలి, అది ఈ సినిమాతో తీరుతుంది అని అన్నారు ఈ సినిమా విడుదలకి ముందు ప్రచార చిత్రాల్లో.

ఇక దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కూడా ఇంతకు ముందు నాగార్జున తో ’ది ఘోస్ట్‌’ అనే ఒక డిజాస్టర్‌ సినిమా తీసి, అది నాగార్జున కెరీర్‌ లో వరస్ట్‌ సినిమా గా చేయగలిగాడు. మరి ప్రవీణ్‌ ’ది ఘోస్ట్‌’ తరువాత చేసిన సినిమా ఈ ’గాండీవధారి అర్జున’. ఇందులో సాక్షి వైద్య కథానాయకురాలిగా వరుణ్‌ తేజ్‌ పక్కన నటించింది.

ఇక ఈ సినిమా కూడా ’ది ఘోస్ట్‌’ సినిమాలనే ఇంకో పెద్ద డిజాస్టర్‌ అయింది. వీకెండ్‌ కలెక్షన్స్‌ చూస్తే ’బెదురులంక 2012’ సినిమా పరవాలేదు అనిపించింది. అలాగే దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ’కింగ్‌ అఫ్‌ కొత్త’ కూడా బాక్స్‌ ఆఫీస్‌ ముందు నిలబడలేకపోయింది. ఆ సినిమా నేరేషన్‌ చాలా స్లోగా ఉండటమే అందుకు కారణం. అది కూడా ఒక అవుట్‌ డేటెడ్‌ కథని తీసుకొని ఎదో చెప్పాలనుకొని, ఇంకేదో తెర విూద చూపించినట్టుగా కనపడుతోంది అని ప్రేక్షకులు సినిమా చూసి కామెంట్స్‌ చేస్తున్నారు.