ఎవరా మహిళా నేత? అని జుట్టుపీక్కోకండి. ఆమె ఎవరో కాదు.. శ్రీకాకుళం వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి. ఆమె పేరు వినగానే… శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె చేపట్టిన ఎన్నో పదవులు గుర్తొస్తాయి. జిల్లాలో కాళింగ వర్గానికి చెందిన బలమైన నేత ఎవరైనా ఉన్నారంటే అది కిల్లి కృపారాణి మాత్రమే. బీసీ మహిళా నేతగా ఆమె సుపరిచితురాలు. అంతే కాదు.. ఆమె కేంద్ర మంత్రిగా పని చేశారు. ఎంపీగా ఉన్నారు. కానీ.. వైసీపీలోనే తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదట.
నిజానికి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి మంచి ఆదరణ ఉంది. కానీ.. అది ఒకప్పుడు.. ఇప్పుడు ఆ ఆదరణ తగ్గుముఖం పడుతోంది. అంత ప్రాధాన్యత ఇప్పుడు లేదు. వైసీపీకి బలం తగ్గుతుంటే.. టీడీపీ బలం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.
అందుకే… వైసీపీని జిల్లాలో స్ట్రాంగ్ గా చేయాలని కిల్లి కృపారాణి ఎంతో ట్రై చేశారట. కానీ.. తనకు ఒక్కరు కూడా సాయం చేయలేదట. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఉన్న వర్గాల పోరు వల్ల.. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు కానీ.. ఒక్కరు కూడా వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదట.
దానితో పాటు.. సీఎం జగన్ కూడా తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. తప్పని పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ పదవి నుంచి కిల్లి కృపారాణి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమె సడెన్ గా పార్టీని వదిలేయడంతో శ్రీకాకుళం రాజకీయాలను సీఎం జగనే స్వయంగా చూసుకుంటున్నారట.
అసలు జిల్లాలో ఏం జరిగింది? అనే దానిపై జగన్ దృష్టి పెట్టారట. అలాగే… పాతపట్నం ఎమ్మెల్యే శాంతికి జిల్లా పగ్గాలను అప్పగించాలని సీఎం జగన్ చూస్తున్నారట.
అయితే.. ఆమె వైసీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుందని వార్తలు రావడంతో… అసలు ఆమె వైసీపీలో ఉంటారా? లేదా? అనే దానిపై ప్రస్తుతం వార్తలు వెలువడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కిల్లి కృపారాణి రాజకీయాల మీదనే చర్చ నడుస్తోంది. అయితే.. కిల్లి కృపారాణి నిజంగా జిల్లా ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకున్నారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న వార్త మాత్రమే ఇది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.