Kichcha Sudeep: హీరో ప్రభాస్ పై అలాంటి కామెంట్స్ చేసిన కిచ్చా సుదీప్.. ఏది వచ్చిన అలాగే ఉంటారంటూ?

Kichcha Sudeep: కన్నడ హీరో నటుడు కిచ్చా సుదీప్ గురించి మనందరికీ తెలిసిందే. సుదీప్ కన్నడ నటుడే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించి మెప్పించారు. అలా కనడ తెలుగు హిందీ భాషల్లో నటించి భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు సుదీప్. కొన్ని సినిమాలలో విలన్ గా కొన్ని సినిమాలలో సహాయ నటుడిగా మరి సినిమాలలో హీరోగా కూడా నటించమని తెలిసిందే. ఇప్పుడు హీరోగా మరో సినిమాలో నటించారు సుదీప్. ఆ సినిమా మరి ఏదో కాదు తాజాగా విడుదలైన మ్యాక్స్.

తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ మీ సొంతం చేసుకుంది. తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్గా రివ్యూస్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా సుదీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ అలాగే విజయ్ దళపతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ..

ప్రభాస్ చాలా మంచి. సింపుల్ పర్సన్. ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తుంటారు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏది వచ్చినా కూడా ఆయన ఒకే విధంగా ఉంటారు. కొంచెం కూడా గర్వం లేని వ్యక్తి అని చెప్పుకొచ్చారు సుదీప్. ఈ సందర్భంగా సుదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫాన్స్ సుదీప్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే సుదీప్ నటించిన మ్యాక్స్ సినిమా ప్రస్తుతం తెలుగు అలాగే తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది.